Lavanya: నా చావుకు కారణం రాజ్ తరుణ్

ఈ లోకంలో నా ప్రయాణం పూర్తి చేశా.. అందుకే ఈ లోకం నుంచి వెళ్లిపొతున్నా. నేను ఏంటో తెలిసిన మనుషులే నన్ను తప్పుబట్టారు.. నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయా.. మైండ్ గేమింగ్, గాసిప్స్‌తో విసిగిపోయా. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యా.. ప్రతీది ఒక పథకం ప్రకారం జరిగింది. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులతో పాటు మాల్వీ మల్హోత్రా కారణం


Published Jul 13, 2024 06:34:10 AM
postImages/2024-07-13/1720870092_modi92.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాజ్‌ తరుణ్‌, లావణ్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్య చేసుకుంటానని తెలిపినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. రాజ్ తరుణ్‌పై లావణ్య 11 ఏళ్లుగా తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్న రాజ్.. తనకు దూరంగా ఉంటున్నాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గుడిలో పెళ్లి చేసుకున్నామని, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపించింది. రాజ్ మూడు నెలలుగా ఇంటికి రావడం లేదని, అడిగితే మాల్వీ కుటుంబసభ్యులు చంపేస్తామని బెదిరించారని తెలిపింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ కారణంగా తాను ప్రెగ్నెంట్ అయ్యానని వెల్లడించింది. రెండు నెలల సమయంలో అబార్షన్ చేయించాడని తెలిపింది. మారు పేరుతో విదేశాలకు కూడా తీసుకెళ్లాడని చెప్పింది. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలను నార్సింగి పోలీసులకు అందించింది. 

అయితే, తాజగా లావణ్య సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి అడ్వకేట్‌కు మెసేజ్ పంపినట్లు తెలిపారు. 'ఈ లోకంలో నా ప్రయాణం పూర్తి చేశా.. అందుకే ఈ లోకం నుంచి వెళ్లిపొతున్నా. నేను ఏంటో తెలిసిన మనుషులే నన్ను తప్పుబట్టారు.. నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయా.. మైండ్ గేమింగ్, గాసిప్స్‌తో విసిగిపోయా. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యా.. ప్రతీది ఒక పథకం ప్రకారం జరిగింది. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులతో పాటు మాల్వీ మల్హోత్రా కారణం' అని 

మెసెజ్ చేసినట్లు అడ్వకేట్‌ తెలిపాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన అడ్వకేట్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన లావణ్య హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకున్న నార్సింగి పోలీసులు.. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

నివారం మీడియాతో మాట్లాడిన లావణ్య.. రాజ్ తరుణ్ తరఫు లాయర్‌ రాజేష్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే డీజీపీకి రాజేష్‌ ఫిర్యాదు చేశాడని, కేసు టేకప్‌ చేస్తానని తనను రాజేష్‌ కలిశాడని వెల్లడించింది. తనను రాజేష్‌ ఇబ్బంది పెడుతున్నాడని  ఆరోపించింది. దీంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని లావణ్య మీడియాతో తెలిపింది. 

కాగా, ఈ ఏడాది జనవరిలో లావణ్య డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. నార్సింగి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌ను తరలించారు. ఉనీత్ రెడ్డి అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు రాజ్ తరుణ్‌తో లింకులు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఉన్నత చదవుల కోసం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన లావణ్య.. కోకాపేటలో మ్యూజిక్ టీచర్‌గా పిల్లలకు సంగీత పాఠాలు చెప్పుకుంటూ వస్తోంది. పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా.. ఉనీత్ రెడ్డితో కలిసి ఆమెనటించింది. సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసింది. ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటు పడిన లావణ్య.. ఉనీత్ రెడ్డితో పాటు ఇందిరతో కలిసి డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telanganam narsingi rajtarun lavanya narsingi-police-station

Related Articles