certificates: వరదల్లో మీ సర్టిఫికేట్లు పోతే ఏం చెయ్యాలి..ఇలా చెయ్యండి !

ప్రాణాలు కాపాడుకోవడమే చాలా కష్టమన్నట్లు భయపడుతున్నారు. అయితే ఇలాంటి టైంలో అసలు మీ సర్టిఫికేట్లు పోతే ఏం చెయ్యాలనేది చూద్దాం రండి.


Published Sep 11, 2024 05:45:00 AM
postImages/2024-09-11/1726013836_certificates.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలోను వరదలు భీభ్సతం సృష్టించాయి. వర్షాల కారణంగా  జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. తెలంగాణలో, ఆంధ్రా లో కూడా వరదలతో జనాలు చాలా ఇబ్బందిపడుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడమే చాలా కష్టమన్నట్లు భయపడుతున్నారు. అయితే ఇలాంటి టైంలో అసలు మీ సర్టిఫికేట్లు పోతే ఏం చెయ్యాలనేది చూద్దాం రండి.


కొందరు వరద బాధితుల పరిస్థితి మరీ దారుణం. ఇళ్లలోని సరుకులు, ఫర్నీచర్, ఇతర వస్తువులే కాదు విలువైన స్టడీ సర్టిఫికేట్స్, ఆస్తులు, భూములకు సంబంధించిన విలువైన పత్రాలు కూడా కొట్టుకుపోయాయి. కుటుంబసభ్యులు ఆధార్, రేషన్ కార్డులు వంటివి కూడా వరదపాలయ్యాయి. ఇలా చాలా అవసరమైన సర్టిఫికేట్లు తడిసి పాడయిపోతే మీరు దాని కోసం ఏం టెన్షన్ పడక్కర్లేదు.  ఇలాంటివారి బాధను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 


విద్యార్హతలకు సంబంధించిన పత్రాలే కాదు ఆస్తులు, భూములకు సంబంధించిన పత్రాలను వరదల్లో కోల్పోయినవారు వెంటనే స్థానిక పోలీసులకు సంప్రదించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. దీని కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఏయే పత్రాలు పోయాయో తెలిపితే ..ఓ దరఖాస్తు పెట్టుకుంటే డూప్లికేట్ పత్రాలనుఅందిస్తారు. మీరు చెయ్యాల్సిందల్లా మీ అవసరమైన డాక్యుమెంట్లు ఏం పోయాయో రాసుకోవాలి. 


ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వం సహాయసహకారాలు అందుతున్నాయి. యుద్ధ ప్రతిపాదికన బాధితులకు సహాయమందిస్తున్నట్లు తెలిపారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు అందజేయనున్నట్లు తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 33మంది మరణించారు. 


ఇక భారీ వర్షాలు, వరదల దాటికి వేలాది ఇండ్లు కూలిపోయాయి.కూలిన ఇళ్లను వెంటనే గుర్తించి బాధితులకు రూ.5 లక్షల రూపాయలతో ఉచితంగా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. సో మీరు మీ డాక్యుమెంట్ల కోసం అస్సలు భయపడకండి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu study floods

Related Articles