భారతీయ వంటల్లో వెల్లుల్లిది చాలా ముఖ్యమైన స్థానం. ఘాటుగా ఉండటం వల్ల దీన్ని చాలామంది మసాలాగా భావిస్తారు. అయితే మధ్యప్రదేశ్ లో దశాబ్ద కాలంగా వెల్లుల్లి నిత్యం వార్తల్లో నిలుస్తోంది. వెల్లుల్లి కూరగాయనా? మసాలానా? అనే విషయంపై పదేళ్ల పాటు సాగుతున్న చర్చకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది.
న్యూస్ లైన్ డెస్క్ : భారతీయ వంటల్లో వెల్లుల్లిది చాలా ముఖ్యమైన స్థానం. వంటల్లో వెల్లుల్లి వాడితే రుచి, వాసన అదిరిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఘాటుగా ఉండటం వల్ల దీన్ని చాలామంది మసాలాగా భావిస్తారు. అయితే మధ్యప్రదేశ్ లో దశాబ్ద కాలంగా వెల్లుల్లి నిత్యం వార్తల్లో నిలుస్తోంది. వెల్లుల్లి కూరగాయనా? మసాలానా? అనే విషయంపై పదేళ్ల పాటు సాగుతున్న చర్చకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది.
వెల్లుల్లి కూరగాయే అని.. దీన్ని కూరగాయల మార్కెట్లో రెండింటిలో అమ్ముకోవచ్చంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. అటు సుగంధ ద్రవ్యంగా, కూరగాయగా రెండింటి జాబితాలోనూ లెక్కపెట్టొచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో రైతులకు, వ్యాపారులకు ఈ తీర్పు చాలా మంచి చేస్తుందంటున్నారు వ్యాపారులు. 2015లో మధ్యప్రదేశ్ లోని ఓ రైతు సంస్థ వెల్లుల్లిని కూరగాయ కేటగిరీలోకి చేర్చాలని మధ్యప్రదేశ్ బోర్డును ఒప్పించిన వివాదం మీద భోపాల్ హైకోర్టు తీర్పు చెప్పింది. 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం ప్రకారం వెల్లుల్లిని మసాలాగా లెక్కించవద్దని తీర్పు చెప్పింది.