MALAYALI: లేటు వయసులో 7వ తరగతి పరీక్షలు రాసిన ఫేమస్ యాక్టర్ !

మలయాళీ నటుడు 68 యేళ్ల వయసులో 7వ తరగతి పరీక్షలు రాసి పాసైయ్యారు. అతనే ఇంద్రన్స్. చాలా మంచి యాక్టర్ . పాత్ర ఏదైనా చక్కగా ఒదిగిపోయి కన్నీళ్లు తెప్పిస్తాడు.


Published Aug 24, 2024 05:31:00 PM
postImages/2024-08-24/1724501103_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నేర్చుకోవాలనే తపన ఉండాలి కాని ...వయసుతో సంబంధం ఏంటి చెప్పండి. జస్ట్ గో విత్ ఇంట్రస్ట్ అంతే. ఇలా ఇంట్రస్ట్ ఫ్లో లో వెళ్తున్న ఓ ఫేమస్ మలయాళీ నటుడు 68 యేళ్ల వయసులో 7వ తరగతి పరీక్షలు రాసి పాసైయ్యారు. అతనే ఇంద్రన్స్. చాలా మంచి యాక్టర్ . పాత్ర ఏదైనా చక్కగా ఒదిగిపోయి కన్నీళ్లు తెప్పిస్తాడు. అయితే నటనతో నే కాదు ..ఇప్పుడు ఏడవ తరగతి పరీక్షలు రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు. 


 కేరళలోని అట్టకులంగర స్కూల్లో విద్యార్థులతో కలిసి ఎగ్జామ్స్ రాశారు. అందరి విద్యార్థుల్లాగా ఈయన కూడా పరీక్షలంటే భయమట. ఎట్టకేలకు రాసి వచ్చాడు ఈ స్టూడెంట్. చిన్న వయసులో చదువుకోవడానికి డబ్బుల్లేక చదువుమానేశారట. ఇప్పుడు డబ్బులున్నా...ఈ వయసులో ఏంటనే ..ఇన్నాళ్లు ఊరుకున్నానని ...ఇప్పుడు ధైర్యం చేసి రాశానని అంటున్నారు ఇంధ్రస్.


డైరెక్టుగా పది చదవడానికి కేరళలో పర్మిషన్ లేదు. కంపల్సరీ ఏడవతరగతి పాసవ్వాల్సిందే. ఇఫ్పుడు రాస్తున్నారు.  దీనికి ఏడవ తరగతి పాస్ కావాలి. అందుకే ఏడో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు ఈ నటుడు. ఈరోజు మలయాళం, ఇంగ్లీష్, హిందీ పరీక్షలకు హాజరయ్యారు. రేపు సోషల్ సైన్స్, సైన్స్, గణితం పరీక్షలు జరగనున్నాయి. రెండు వారాల్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి అప్పుడు పై చదువులకు ఆలోచిస్తానంటున్నారు ఇంధ్రస్ ..అంతేకాదు ఇంద్రన్స్ 10వ తరగతికి రాగానే కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా అతడిని ఎంపిక చేయనున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీ లో తన ప్రయాణం మొదలైంది.  ఇప్పటికి 50 సినిమాలకు పైగా చేసి మలయాళంలో టాప్ నటుడిగా నిలిచాడు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kerala education malayala-industry

Related Articles