మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్స్ బాయ్స్ స్కూల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
న్యూస్ లైన్ డెస్క్: మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్స్ బాయ్స్ స్కూల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 9వ తరగతి ముగ్గురు విద్యార్థులను విచక్షణారహితంగా పది మంది 10వ తరగతి విద్యార్థులు చితకబాదారు. గుడ్డలు నోట్లో కుక్కి, బాట్లు రాడ్లతో విచక్షరహితంగా విద్యార్థులు కొట్టారని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉదయం స్కూల్ ప్రిన్సిపాల్‌తో గొడవకు దిగారు. కాగా, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 10 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తాము.. ఇష్యు బయకుటకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ తల్లిదండ్రలు మాట వినకుండా భారీ ఎత్తున స్కూల్ వద్ద ఆందోళన చేశారు. వెంటనే ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత రెండు నెలల క్రితమే కాలేజ్ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులపై దాడి చేసి గాయపరిచిన విషయం మరువక ముందే ఘటన జరిగింది. దీంతో రెసిడెన్షియల్ స్కూల్‌లో రెండో సారి గొడవలు జరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సరియైన పర్యవేక్షణ లేకపోవడమే వరుస గొడవలకు కారణమని తల్లదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.