ప్రస్తుత కాలంలో చాలామంది యుక్త వయసు నుంచి మొదలు పెళ్లి తర్వాత కూడా మొటిమల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫేస్ పై మొటిమల వల్ల అమ్మాయిలు ఎక్కువగా సమస్యలు
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది యుక్త వయసు నుంచి మొదలు పెళ్లి తర్వాత కూడా మొటిమల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫేస్ పై మొటిమల వల్ల అమ్మాయిలు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు. వాటిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినా కానీ ఉపశమనం లభించదు. దీంతో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు వీటిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటివారు ఇంట్లోనే మొటిమలను ఈజీగా తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా పసుపు అనేది మొటిమలను తగ్గించడానికి ఎంతో మేలు చేస్తుంది. శనగ పిండిలో పసుపు కలిపి, అందులో కాస్త పాలు కలిపి మెత్తగా చేసుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలట. దీనివల్ల ముఖంపై మొటిమలు వచ్చి పుండుపై పసుపు అద్భుతంగా పనిచేస్తుందట. పుండులో ఉండే మీ కిటకాలను చంపేసి పుండు మానేలా చేస్తుందట.
అంతేకాకుండా పాలు అనేవి ముఖం చాలా స్మూత్ గా తయారవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుందట. ఇక ముఖ్యంగా సెనగపిండి అనేది ముఖంపై ఉండే మృత కణాల మొహంపై తొలగించి క్లీన్ పేస్ అయ్యేలా చేస్తాయట. కాబట్టి ఈ మూడింటి కాంబోనేషన్ లో పూర్తిగా పింపుల్స్ తొలగిపోతాయట. ముఖ్యంగా ఈ పిండిని కనీసం 25 నిమిషాల పాటు మొహంపై ఉంచుకొని, పూర్తిగా కడిగేసి స్నానం చేస్తే సరిపోతుందట.
అంతేకాకుండా ముఖంపై పింపుల్స్ పూర్తిగా పోవాలంటే వారానికి ఒక్కసారైనా సరే ఆవిరి పట్టాలట. ఇలా ఆవిరి పట్టడం వల్ల శ్వేతనాళాల్లో పేరుకున్న వ్యర్థాలు, బయటకి వెళ్ళిపోయి, క్లియర్ స్కిన్ మీ సొంతమవుతుందట. కాబట్టి న్యాచురల్ గా మొహాన్ని శుభ్రం చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అద్భుతమైన ఫేస్ మీ సొంతం అవుతుందని నిపుణులు అంటున్నారు.