ఎల్లమ్మ తల్లి భక్తుడినైన నేను అలగలేదని అన్నారు. మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పక్కకు వెళ్లి కుర్చున్నాని తెలిపారు. ప్రభుత్వ అధికారులుగా రాలేదని.. భక్తులుగానే వచ్చామని అన్నారు. మేయర్ కింద పడే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మహిళలు ఇబ్బందులు పడితే బాధ్యతగా సీరియస్ అయ్యానని వెల్లడించారు. తోపులాట నివారించేందుకు కాసేపు పక్కన కుర్చున్నామని పొన్నం తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: బల్కంపేట దేవాలయంలో అమ్మవారి కల్యాణోత్సవం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనపై సెక్రటేరియట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో కనీస ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించనివారిపై చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ అనుదీప్‌పై పొన్నం ప్రభాకర్, విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి, మేయర్ అలిగారంటూ వార్తలు వచ్చాయి.
కాగా, సమావేశంలో మీడియాతో మాట్లాడిన పొన్నం.. 'అలక' అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి భక్తుడినైన నేను అలగలేదని అన్నారు. మహిళలు ఇబ్బందులు పడుతున్నారని పక్కకు వెళ్లి కుర్చున్నాని తెలిపారు. ప్రభుత్వ అధికారులుగా రాలేదని.. భక్తులుగానే వచ్చామని అన్నారు. మేయర్ కింద పడే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మహిళలు ఇబ్బందులు పడితే బాధ్యతగా సీరియస్ అయ్యానని వెల్లడించారు. తోపులాట నివారించేందుకు కాసేపు పక్కన కుర్చున్నామని పొన్నం తెలిపారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, GHMC కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, బల్కంపేట దేవాలయ ఈవో, రాష్ట్రస్థాయి బోనాల కమిటి మెంబర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.