రాష్ట్రంలో గణేష్ ఉత్పవాలపై మంత్రులు పొన్నం ప్రభకార్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సచివాలయంలో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో గణేష్ ఉత్పవాలపై మంత్రులు పొన్నం ప్రభకార్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సచివాలయంలో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని, అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
గణేష్ ఉత్సవాల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని, మెట్రో సమయాలు పొడిగిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. గతేడాది కంటే ఈసారి 10శాతం విగ్రహాలు పెరిగే అవకాశం ఉందని, రోడ్ల మరమత్తులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని, పోలీసులకు నిర్వాహకులు సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. ఈ సారి మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహించాలని, మట్టి విగ్రహాలపై అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రులు సూచించారు. ఈ సమావేశంలో హైదారాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, కలెక్టర్, హైద్రాబాద్ డిస్ట్రిక్ సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఖైరతాబాద్ గణేష్, ఇతర గణేష్ ఉత్సవ కమీటీ, విశ్వ హిందు పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.