Bonalu: పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

ఇందులో భాగంగానే శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలు ఇవ్వనున్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్య లక్ష్మి ఆలయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, కర్వాన్ వద్ద దర్బార్ మైసమ్మ టెంపుల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 

Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721390418_modi41.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే, గతంలో అధికారులు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించేవారు. మంత్రులను భాగస్వామ్యం  చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్ నగరవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీ పూర్తయింది. ఈనెల 28న దేవాలయాల వారిగా మంత్రులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 

ఇందులో భాగంగానే శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలు ఇవ్వనున్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్య లక్ష్మి ఆలయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, కర్వాన్ వద్ద దర్బార్ మైసమ్మ టెంపుల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 

మిరాలం మండిలోని శ్రీ మహంకాళి ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సబ్జి మండిలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చిలకలగూడలోని కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు ఇవ్వనున్నారు. సరూర్‌నగర్ వద్ద ఉన్న ఖిలా మైసమ్మ ఆలయంలో ఉన్న మంత్రి దనసరి అనసూయ సీతక్క పట్టు వస్త్రాలు ఇవ్వనున్నారు. నాచారం ఉప్పల్ వద్ద ఉన్న శ్రీ మహంకాళి సహిత మహకాళేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news newslinetelugu telanganam bonalu bonalufestival

Related Articles