నీకు ఆ పోస్టింగ్ లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఎంతో మంది అధికారులు వస్తుంటారు, పోతుంటారు. కానీ, నేను లోకల్ ఇక్కడే ఉంటా అంటూ ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిపై దానం నాగేందర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారాయి.
న్యూస్ లైన్, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ బెదిరింపులకు దిగాడు. నాపైనే కేసులు పెడ్తావా, నీపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా, నీకు హైడ్రా కమిషనర్ పోస్టింగ్ ఇష్టం లేకనే నాపై కేసులు పెట్టావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రకంగా నీకు ఆ పోస్టింగ్ లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఎంతో మంది అధికారులు వస్తుంటారు, పోతుంటారు. కానీ, నేను లోకల్ ఇక్కడే ఉంటా అంటూ ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిపై దానం నాగేందర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారాయి.
హైదరాబాద్ నందగిరి హిల్స్ దగ్గర ఉన్న హెచ్ఎండీఏ పరిధిలోని ఓ పార్క్‌కు చెందిన ప్రహారీ గోడను ఎమ్మెల్యే దానం నాగేందర్, అతని అనుచరులు కూల్చివేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గోడ కూల్చివేసిన వారిపై కేసులు పెట్టారు. దీనిపై చిర్రుబుర్రులాడిన దానం నాగేందర్ ఇలా బహిరంగంగా బెదిరింపులకు దిగాడు.
హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములు ఎలాంటి అక్రమణాలకు గురి కావొద్దని, అలా జరిగిన వాటిని కాపాడేందు కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. దీని కోసం స్పెషల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను నియమించారు. హైడ్రాపై ఎవరి ఒత్తిడి ఉండదని, ప్రలోభాలకు లొంగదని గతంలో చెప్పారు. అయితే, ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రాను తప్పు పడుతున్నారు. పైగా కమిషనర్‌పై ఒక రకంగా బెదిరింపులకు దిగాడు. హైడ్రాపై ఎవరి ఒత్తిడి ఉండదని చెప్పినా సీఎం రేవంత్ రెడ్డికే ఫిర్యాదు చేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు దానం నాగేందర్ వెళ్లి ఫిర్యాదు చేస్తే ముఖ్యమంత్రి ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. నిజంగా తప్పు చేసిన దానం నాగేందర్‌పై కేసు పెట్టడాన్ని సమర్థిస్తారా..? లేక తమ ఎమ్మెల్యేపై కేసు పెట్టారు కాబట్టి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏమైనా చర్యలు తీసుకుంటారా..? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.