BRS : ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ రేపటికి వాయిదా

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పిటిషన్ మీద ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరుతోంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721653458_highcourt.jpg

న్యూస్ లైన్ డెస్క్ :  బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, సంజయ్ కుమార్ లు కారు దిగి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. కాగా.. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది.

కాగా.. ఈరోజు హైకోర్టులో బీఆర్ఎస్ వేసిన పిటిషన్ మీద విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మంగళవారం నాటికి వాయిదా వేసింది.

newsline-whatsapp-channel
Tags : kcr telangana ts-news news-line mla brs brsmla latest-news

Related Articles