కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రభుత్వ భూములు చెరువులకు సంబంధించి అక్రమ కట్టడాలను గుర్తిస్తూ వస్తోంది. ఎక్కడైతే
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రభుత్వ భూములు చెరువులకు సంబంధించి అక్రమ కట్టడాలను గుర్తిస్తూ వస్తోంది. ఎక్కడైతే అక్రమంగా ఆక్రమించి కట్టడాలు నిర్మించారో వాటిపై దృష్టి పెట్టి హైడ్రా అనే పేరుతో కూల్చివేతను మొదలుపెట్టింది. దీనికి ఏవి రంగనాథన్ ను కమిషనర్ గా నియమించి ఆయన ఆధ్వర్యంలో ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఆక్రమించారో వాటిని గుర్తించి కూల్చివేత పనులు మొదలుపెట్టారు.
అదే తాజాగా మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున పెద్ద కన్వెన్షన్ హాలును నిర్మించారనే ఆరోపణలు అప్పట్లో చాలా వరకు వచ్చాయి. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దీనిపై దృష్టి పెట్టి హైడ్రా పేరుతో పూర్తి వివరాలు సేకరించి ఈరోజు కూల్చివేత ప్రారంభించింది. మొత్తం ఈ చెరువు నుంచి మూడు ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఆయన కన్వెన్షన్ హాల్ నిర్మించారని హైడ్రా గుర్తించింది.
https://x.com/iamnagarjuna/status/1827242881674850568?s=19
ప్రస్తుతం ఆ కన్వెన్షన్ హాలును కూల్చివేసి హైడ్రా స్వాదినం చేసుకుంది. దీనిపై స్పందించినటువంటి నాగార్జున ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చేశారన్నారు. తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని ఇది పట్టా భూమి అని తెలియజేశారు. నేను ఆ భూమిలో ఒక అంగుళం కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ ల్యాండ్ లోని నిర్మాణం చేసినట్టు స్పష్టం చేశారు. నేను ఆక్రమించినట్లయితే దాని నేనే కూల్చివేసే వాడినని తెలియజేశారు. ప్రస్తుతం నాగార్జున ఈ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.