దీన్ని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు తీవ్రంగా వ్యతిరేకించారు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ స్థలంలో పెయిడ్ పార్కింగ్ పెట్టడంతో వాహనదారుల ఆందోళన చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా మహా ధర్నా నిర్వహిస్తామని మెట్రో ప్రయాణికులు స్పష్టం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: పెయిడ్ పార్కింగ్‌పై హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. నాగోల్ మెట్రో పార్కింగ్ వద్ద వాహనాలు నిలిపే వారు ఛార్జ్ చెల్లించాలని ఇటీవల హైదరాబాద్ మెట్రో ప్రకటించిన విషయం తెలిసిందే.
బైకులను రెండు గంటల పాటు పార్క్ చేస్తే.. రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. 8 గంటల వరకు పార్క్ చేస్తే రూ.25.. 12 గంటల వరకు అయితే రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. కార్లను రెండు గంటలు పార్క్ చేస్తే రూ.30 చెల్లించాలి. 8 గంటల వరకు రూ.75.. 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలు చెల్లించాలని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం సూచించింది.
అయితే, దీన్ని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు తీవ్రంగా వ్యతిరేకించారు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ స్థలంలో పెయిడ్ పార్కింగ్ పెట్టడంతో వాహనదారుల ఆందోళన చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా మహా ధర్నా నిర్వహిస్తామని మెట్రో ప్రయాణికులు స్పష్టం చేశారు. దీంతో పెయిడ్ పార్కింగ్‌పై మెట్రో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పెయిడ్ పార్కింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు.