కోట్లలో నగలు..లగ్జరీ కార్లు..లక్షల్లో చీరలు ...ఇవన్నీ ఇప్పుడు. కాని పెళ్లికి ముందుమాత్రం నీతా పరిస్థితి వేరు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నీతా అంబానీ దర్పం చూశారా..నడిస్తే లక్ష..కుర్చుంటే కోటి ...లైఫ్ లో అన్ని చాలా ఖరీదైనవే. కాని ఇదంతా ముఖేష్ తో పెళ్లి అయ్యాక సంగతి. అంబానీ ఇంటి కోడలు కాకముందు.. నీతా లైఫ్ ఎలా ఉండేది..? ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి.. ఈ అంబానీ ఇంట్లో అడుగుపెట్టిందో మీకు తెలుసా..ఈ విషయాన్ని నీతా నే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
1985లో ముకేష్ అంబానీ, నీతా అంబానీల వివాహం జరిగింది. ఈ దంపతలకు ముగ్గురు సంతానం. ఇషా, ఆకాశ్ లు కవలలు కాగా.. చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ప్రస్తుతం ఈ ముగ్గురు.. చాలా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. కోట్లలో నగలు..లగ్జరీ కార్లు..లక్షల్లో చీరలు ...ఇవన్నీ ఇప్పుడు. కాని పెళ్లికి ముందుమాత్రం నీతా పరిస్థితి వేరు. ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడేవారట.
ఆరేళ్ల వయసు నుంచే నీతా అంబానీ భరత నాట్యంలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టిందట. చాలా తక్కువ కాలంలో ఆమె ఫ్రొఫెషనల్ డ్యాన్సర్ గా మారింది. అదే తన కెరీర్ గా మార్చుకుంది. మొదట్లో ఓ చిన్న స్కూల్లో డ్యాన్స్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేయడం మొదలుపెట్టింది. అలాంటి సమయంలోనే ముకేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ నీతాను కలుసుకున్నారు. ఆమెను చూసి.. తన కొడుకు ముకేష్ అంబానీని పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. మొదట కాస్త నో చెప్పినట్లున్నా...తర్వాత పెళ్లి కి ఒప్పుకుందట.
పెళ్లి తర్వాత కూడా తాను పని చేసుకోవడానికి ఒకే అయితేనే.. పెళ్లికి సరే అని ఆమె షరతు కూడా పెట్టారట. దానికి అంగీకరించిన తర్వాతే.. ముకేష్ తో నీతా అంబానీ వివాహం జరిగింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నీతా.. పెళ్లి తర్వాత కూడా సెయింట్ ఫ్లవర్ నర్సరీలో టీచర్‌గా పనిచేశానని చెప్పింది. మిలియనీర్ కుటుంబంలో వివాహం చేసుకున్నప్పటికీ, ఆ సమయంలో తన డ్యాన్స్ స్కిల్స్‌ను కాపాడుకోవడానికి నెలకు 800 జీతంతో పాఠశాలలో పనికి వెళ్లానని ఆమె చెప్పడం గమనార్హం.