రైతు బిడ్డ ఎదిగితే ఇంత కుళ్ళా..పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ చేస్తున్న నెటిజన్స్.!

పల్లవి ప్రశాంత్ టిక్ టాక్ లో వ్యవసాయ పనులకు సంబంధించి వీడియోలు పెట్టి ఎంతో ఫేమస్ అయ్యారు. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత యూట్యూబ్ ద్వారా అభిమానులను సంపాదించుకొని


Published Jul 31, 2024 10:04:38 AM
postImages/2024-07-31/1722438244_pallavi.jpg

న్యూస్ లైన్ డెస్క్: పల్లవి ప్రశాంత్ టిక్ టాక్ లో వ్యవసాయ పనులకు సంబంధించి వీడియోలు పెట్టి ఎంతో ఫేమస్ అయ్యారు. టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత యూట్యూబ్ ద్వారా అభిమానులను సంపాదించుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.  వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ రైతు బిడ్డనంటూ ఎంతోమంది నెటిజన్ల ప్రశంసలు పొందాడు.  అదే ఎనర్జీతో బిగ్బాస్ సీజన్ సెవెన్ లో అడుగుపెట్టి తనదైన పర్ఫామెన్స్   చూపించారు. అంతేకాదు రైతు బిడ్డని అంటూ చెప్పుకుంటూ చివరికి బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

https://www.instagram.com/reel/C-AfNEISwm_/?igsh=MXJuY3Q5ZXAzcWo1Mw==

 అయితే ఆయన బిగ్ బాస్ లో ఉన్న సమయంలో తనకు వచ్చిన రెమ్యునరేషన్ తో ఎంతో కొంత రైతులకు న్యాయం చేసేలా చేస్తానని అన్నారు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత అది చేశాడా?చేయలేదా అనేది ఎవరికి తెలియదు. దీంతో కొంతమంది  నెటిజన్స్ ఆయనను సోషల్ మీడియాలో దారుణంగా తిడుతున్నారు.  రైతుల పేరుతో విన్ అయి రైతులకు ఏం న్యాయం చేసావు అంటూ తిట్టిపోస్తున్నారు. వాస్తవానికి పల్లవి ప్రశాంత్ ఒక పెద్ద రైతు. ఆయన వచ్చిన రెమ్యునరేషన్ అంతా కోటి దాటదు. ఇందులో కెళ్ళి ఆయన రైతులకు ఎంత ఇస్తాడు.

ఒకవేళ ఇచ్చిన ఆయన ఒక రైతు. ఒకవేళ ప్రశాంత్ వచ్చిన అమౌంట్  ఎంతో కొంత అమౌంట్ రైతులకు ఇస్తే, 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఎంత ఇవ్వాలి. పూర్తిగా ప్రజలపై టికెట్ల రూపంలో సంపాదించేవారు  కోట్లు కోట్లు కూడాబెట్టుకొని ఆస్తులు సంపాదిస్తున్నారు. వారి సంపాదనతో పోలిస్తే పల్లవి ప్రశాంత్ సంపాదన ఎంత.? 100 కోట్లు తీసుకునే ఒక హీరో అందులో నుంచి ఒక 50 కోట్లు పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడా.. కనీసం 50 లక్షలు కూడా జీవితకాలం సంపాదించలేనటువంటి  పల్లవి ప్రశాంత్ ఎవరికి ఏమి ఇస్తాడు అని కొంతమంది ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

 తనకు చేతనైన సాయం ఇప్పటికే రైతులకు చేస్తూ వస్తున్నాడు. దాన్ని బయట పెట్టడం ఇష్టం లేక ఆయన  సైలెంట్ గా ఉంటున్నాడు. కేవలం బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి  పల్లవి ప్రశాంతును ఇంతగా తిట్టి పొడుస్తున్నటువంటి నెటిజన్లకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలను కూడా నిందించే శక్తి ఉండాలని, ఆయన అభిమానులు నెట్టింటా సవాల్ విసురుతున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

newsline-whatsapp-channel
Tags : news-line farmer nagarjuna big-boss7 remyunaretion

Related Articles