గత కొన్ని నెలలుగా ఆసరా పింఛన్ల పంపిణీలో ఆలస్యం నెలకొంటుంది. ప్రతీనెల మొదటి వారంలో రావాల్సిన పింఛన్లు నెల చివరికైనా రావడం లేదు.
న్యూస్ లైన్ డెస్క్: గత కొన్ని నెలలుగా ఆసరా పింఛన్ల పంపిణీలో ఆలస్యం నెలకొంటుంది. ప్రతీనెల మొదటి వారంలో రావాల్సిన పింఛన్లు నెల చివరికైనా రావడం లేదు. దాంతో వృద్ధులు, వికలాంగులకు ప్రతీనెల ప్రదక్షిణలు, పడిగాపులు తప్పడం లేదు. నెలాఖరు వచ్చినా పింఛన్లు దక్కకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీంతో ఓ వృద్ధురాలు రెండు నెలలుగా పింఛన్లు రావడం లేదని నిరసన తెలిపింది. మా కొడుకులు మమల్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. రెండు నెలలకు ఒక్కసారి పెన్షన్ ఇస్తే మేము ఎలా బ్రతకాలని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
సంగారెడ్డి చోటుకూరు మండలం శివంపేట్ గ్రామం ఏపీజీవీ బ్యాంక్ వద్ద బ్యాంకు దగ్గర పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు. పింఛన్లు కోసం ఉదయం నుంచి బ్యాంకు దగ్గర వృద్ధులు పడిగాపులు కాస్తుంటే.. బ్యాంక్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు పింఛన్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.