ఒకప్పుడు టెక్నాలజీ అంతగా ఉండేది కాదు. దీంతో చాలామంది ప్రజలు ఏ పని చేయాలన్న మైండ్ ఉపయోగించి చేసేవారు. కనీసం చిన్నచిన్న లెక్కలను కూడా చేతి ద్వారానే లెక్కించేవారు. ఎప్పుడైతే
న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు టెక్నాలజీ అంతగా ఉండేది కాదు. దీంతో చాలామంది ప్రజలు ఏ పని చేయాలన్న మైండ్ ఉపయోగించి చేసేవారు. కనీసం చిన్నచిన్న లెక్కలను కూడా చేతి ద్వారానే లెక్కించేవారు. ఎప్పుడైతే మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిందో మన మైండ్ కు పని చెప్పడం తగ్గించేసాం. చిన్న లెక్కలు కూడా మనం చేయలేకపోతున్నాం. చిన్నచిన్న లెక్కలకు కూడా ఫోన్ లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూస్తున్నాం. ఈ విధంగా మైండ్ కు ఎలాంటి పని లేకపోవడంతో చాలామంది ప్రజలు సోమరులుగా తయారవుతున్నారు.
అలాంటి వారి కోసం సోషల్ మీడియాలో కూడా కొన్ని టాస్కులు విసురుతున్నారు. వాటినైనా సాల్వ్ చేయండి అని ప్రశ్నిస్తున్నారు. అదే ఆప్టికల్ ఇల్యూషన్స్. దీని ద్వారా మన మైండ్ ను మరియు మన కళ్ళ పనితీరును తెలుసుకుంటున్నారు. అయితే పైన ఫోటోలో కూడా అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూజన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఉన్న నలుగురు మనుషులను కనీసం గుర్తుపట్టలేకపోతున్నారు.
https://www.instagram.com/reel/C7iZomHP_zP/?igsh=MTA4cG80MjRzY2Rqcw==
ఒకవేళ ఎవరైనా గుర్తుపట్టినట్టయితే వారి మైండ్ అండ్ కళ్ళు చాలా షార్ప్ అని అర్థం చేసుకోవాలి. ఈ ఫోటోలో ఉన్న వారంతా పురుషులే. ఇందులో మూడు ఫోటోలు ఈజీగా కనిపిస్తాయి. కానీ నాలుగవ ఫోటో మాత్రం గుర్తించడం కష్టం. ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు చెట్టు ఎక్కుతూ కనిపిస్తారు. మీరు అక్కడే నిశితంగా పరిశీలించి చూసినట్లయితే మొత్తం నలుగురిని కనిపెట్టవచ్చు. స్కెచ్ తో వేసింది కాబట్టి కాస్త ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపించనట్లయితే కింద ఉన్న ఇమేజ్ సర్కిల్ గీసి ఉంది అందులో గమనించండి. మీరు గుర్తించినట్లయితే తప్పక కామెంట్ చేయండి.