పద్మావతిపురంలోని పాస్ మనోవికాస కేంద్రంలో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన ఏడుగురు మానసిక రోగులను రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే జగ్గయ్యపేట, నెల్లూరు జిల్లాల్లో అధిక సంఖ్యలో డయేరియా కేసులు నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు తిరుపతిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. డయేరియాతో ఇద్దరు మానసిక వికలాంగులు మృతిచెందారు. పద్మావతిపురంలోని పాస్ మనోవికాస కేంద్రానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులను శేషాచలం, గణపతిగా గుర్తించారు.
కాగా, పద్మావతిపురంలోని పాస్ మనోవికాస కేంద్రంలో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన ఏడుగురు మానసిక రోగులను రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనిత, తేజ, ఈశ్వర్ రెడ్డి, ప్రదీప్, హిమతేజ చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. తాజగా, డయేరియా విజృంభణ జిల్లా పాలానధికారి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.