ఇప్పడు వైరల్ ఫీవర్స్ కారణంగా రోజుకు వెయ్యికి పైగా ఓపీ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చెబుతున్నారు. జూన్, జూలై కంటే ఆగస్టులోనే ఎక్కువ మంది జ్వరాల బారిన పడినట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌ను విష జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూతో పాటు పెద్ద సంఖ్యలో వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందుతున్నాయి. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. పారిశుద్య లోపం, కలుషిత నీళ్లు తాగటంతో రోగాలు వైరల్ ఫెవర్స్ వ్యాప్తి మరింత పెరిగిపోతోందని డాక్టర్లు చెబుతున్నారు.
దీంతో ప్రతి ఇంట్లో ఇద్దరూ లేదా ముగ్గురు మంచం పడుతున్నారు. ఫీవర్ హస్పిటల్స్‌కి మామూలు రోజుల్లో 3 వందల నుంచి 5 వందల వరకు ఓపి ఉండేది. కానీ, ఇప్పడు వైరల్ ఫీవర్స్ కారణంగా రోజుకు వెయ్యికి పైగా ఓపీ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చెబుతున్నారు. జూన్, జూలై కంటే ఆగస్టులోనే ఎక్కువ మంది జ్వరాల బారిన పడినట్లు తెలుస్తోంది.
పరిశుభ్రమైన నీటిని, ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పరిసరాల్లో అపరిశుభ్రత, కలుషితాహారం, ఇతర కారణాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. పరిశుభ్రమైన నీటిని, ఆహారాన్ని తీసుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దోమలు రాకుండా చూసుకోవాలంటున్నారు.
మరోవైపు పరిసరాల్లో నిలిచిన నీరు, మురుగును వెంటనే తొలగించకపోవడం కారణంగానే విషజ్వరాలు వస్తున్నాయని పేషేంట్లు వాపోతున్నారు. వీధుల్లో తరుచు దోమల బెడద ఎక్కువగా ఉన్నప్పటికీ GHMC అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. పెరుగుతున్న విషజ్వరాల కేసులను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.