గతంలో దేశంలో పేదరిక నిర్మూలన పేరుతో రుణాలు తీసుకొని ఉగ్రవాదానికి నిధులు మళ్లించిన పాక్ ఇప్పుడు చాలా కష్టం గా ఉంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ ఆర్ధిక శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. మేం తీవ్ర ఆర్ధిక సంక్షోభం లో ఉన్నాం. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తమకు సాయం చెయ్యాలని కోరుతూ ట్విట్టర్ వేదికగా పాక్ ఆర్ధిక శాఖ ట్వీట్ చేసింది. ఇండియా పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుధ్ధ వాతావరణం లో పాకిస్థాన్ తమకు సాయం చెయ్యాలని కోరడంపై చాలా రకాలు మాట్లాడుతున్నారు. అయితే అంతర్జాతీయంగా ఉన్న బ్యాంకులను పాక్ అభ్యర్ధిస్తుంది. గతంలో దేశంలో పేదరిక నిర్మూలన పేరుతో రుణాలు తీసుకొని ఉగ్రవాదానికి నిధులు మళ్లించిన పాక్ ఇప్పుడు చాలా కష్టం గా ఉంది. కాని పాకిస్థాన్ మాత్రం అప్పు కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది.