GO 33: మంత్రి హరీష్ రావు వద్దకు జోవో-33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు

ప్రభుత్వ అనాలోచితంగా తెచ్చిన జీవో వల్ల తమ పిల్లలు మెడిసిన్ కోర్స్ చదివే అవకాశాలు కోల్పోతున్నారని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 


Published Aug 08, 2024 01:05:55 PM
postImages/2024-08-08/1723102555_GO33.jpg

న్యూస్ లైన్ డెస్క్: సిద్ధిపేట BRS ఎమ్మెల్యే,  మాజీ మంత్రి హరీష్ రావును ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జోవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. ప్రభుత్వ అనాలోచితంగా తెచ్చిన జీవో వల్ల తమ పిల్లలు మెడిసిన్ కోర్స్ చదివే అవకాశాలు కోల్పోతున్నారని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. 

నాలుగేళ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు సొంత రాష్ట్రంలోనే నాన్ లోకల్ కావడం బాధగా ఉందని అన్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని హరీష్ రావును కోరారు. తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే జీవో-33పై పోరాటం చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిషత్తు కోసం న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో BRS పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మన పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోడానికి కొత్త సమగ్ర విధానం రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులతో ఒక హై లెవెల్ కమిటీ వేసి తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam harishrao go33

Related Articles