పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాట్లు చేయాలని పవన్ నిర్ణయించారు. అంతేకాకుండా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై సమీక్షలు జరుపుతున్న ఆయన.. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వినాయక చవితికి మట్టి వినాయకులనే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు పవన్ సూచించారు.
పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాట్లు చేయాలని పవన్ నిర్ణయించారు. అంతేకాకుండా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుందన్నారు.
ప్రసాదాలను ప్లాస్టిక్ కవర్లల్లో కాకుండా తాటాకు బుట్టలు.. ఆకుల దొన్నెలతో వాడాలని ఆదేశించారు. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల్లో ప్రయోగత్మాకంగా చేపడతామని అన్నారు. బటర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని పలువురు నిపుణులు సూచించారు. అలాంటి కవర్ల స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడితే అవి వ్యర్థాల నిర్వహణ కూడా సులభం. వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తామని పవన్ తెలిపారు.