ఈ అంశంపై మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని గొల్లకొండ తండావాసులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో తీవ్ర అవస్థలు పడుతున్నామంటూ.. ఏకంగా నేషనల్ హైవేపై కూర్చొని నిరసన తెలిపారు. వాహనాల రాకపోకలకు అడ్డంగా రోడ్డుపై భైఠాయించి ధర్నా చేశారు. నెలరోజుల నుంచి విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
న్యూస్ లైన్ డెస్క్: కరెంటు కోతలపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజులోనే అనేక సార్లు కరెంటు పోతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అయితే, ఏ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. రాష్ట్రంలో అసలు కరెంటు కోతలే లేవని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్‌లు ఏర్పాటు చేసి మరీ చెప్పారు. ఎక్కడైనా సాంకేతిక లోపం కారణంగా కరెంటు పోతే అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.
ఇది ఇలా ఉంటే.. మరోవైపు పలు గ్రామాల్లోని ప్రజలు తరచుగా కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే లేకుండా పోయారని అంటున్నారు.
తాజాగా, ఈ అంశంపై మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని గొల్లకొండ తండావాసులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో తీవ్ర అవస్థలు పడుతున్నామంటూ.. ఏకంగా నేషనల్ హైవేపై కూర్చొని నిరసన తెలిపారు. వాహనాల రాకపోకలకు అడ్డంగా రోడ్డుపై భైఠాయించి ధర్నా చేశారు. నెలరోజుల నుంచి విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కరెంట్ కోతల విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా.. ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.