ప్రతి అమ్మాయి పుట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే వారి మాతృత్వానికి ప్రతీక. అందుకే స్త్రీని దేవతతో కొలుస్తారు. స్త్రీ పడే ఇబ్బందులు పురుషులు, అస్సలు పడలేరు. అందుకే స్త్రీలకు భూదేవి
న్యూస్ లైన్ డెస్క్: ప్రతి అమ్మాయి పుట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే వారి మాతృత్వానికి ప్రతీక. అందుకే స్త్రీని దేవతతో కొలుస్తారు. స్త్రీ పడే ఇబ్బందులు పురుషులు, అస్సలు పడలేరు. అందుకే స్త్రీలకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుందని అంటారు. అలా ఎదిగే ప్రతి స్త్రీ నెలసరి ప్రక్రియను ఎదుర్కొంటుంది.
తప్పనిసరిగా 13 నుంచి 14 ఏళ్ల వయసులో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతి నెల 24 నుంచి 38 రోజులకు ఒకసారి నెలసరి అనేది తప్పక వస్తుంది. ఇది కామన్ గా చెప్పుకోవాల్సిందే కానీ కొంతమంది అమ్మాయిలకు నెలలో రెండుసార్లు కూడా నెలసరి వస్తుందట. మరి ఇలా ఎందుకు జరుగుతుంది ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఒక్కసారి పిరియడ్ వస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు.
కానీ నెలలో రెండుసార్లు వస్తే మాత్రం వారికి రుతుక్రమం సరైన పద్ధతిలో లేనట్టే అని అర్థం చేసుకోవాలి. చాలామంది అమ్మాయిలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తే దాన్ని పీసీఓడీ సమస్య అంటారు. ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తప్పనిసరిగా రెండుసార్లు నెలసరి సమస్య ఎదుర్కోవాలట. ఇది ఎక్కువ మంది అమ్మాయిల్లో ఉండదు కానీ అరుదుగా కొంతమంది అమ్మాయిల్లో ఏర్పడుతుందట.
జరిగితే తప్పక వైద్యుల దగ్గర చూయించుకోవాలని అంటున్నారు. ఒకవేళ నెగ్లెట్ చేస్తే అది సీరియస్ అయిపోయి అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇదే కాకుండా శరీరంలో ఈస్ట్రోజన్ సమతుల్యత కోల్పోవడం వల్ల లేకపోవడం వల్ల కూడా రెండుసార్లు నెలసరి వస్తుందట. కాబట్టి ఈ సమస్యతో బాధపడే ప్రతి అమ్మాయి వైద్యులను సంప్రదించి సరైన పద్ధతిలో చికిత్స తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.