జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా BRS ఎమ్మెల్యేలను కేవలం రూ. 5 నుండి రూ.10 కోట్లకు కొంటున్నామని చెప్పడం గమనార్హం.
న్యూస్ లైన్ డెస్క్: బాన్సువాడ మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ ఎన్నో కోట్లు ఇచ్చారని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం నివాసానికి వెళ్లి మరీ శాలువా కప్పి పార్టీలోకి అహ్వాహించారు.
ఆయన పార్టీ మార్పుపై BRS నాయకులతో పాటు, నియోజకవర్గ ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో రైతులు, నియోజకవర్గ ప్రజల బాగు కోసమే పార్టీ మారుతున్నానని ఆయన వెల్లడించారు. మరోవైపు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అమ్ముడుపోయారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజగా, జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా BRS ఎమ్మెల్యేలను కేవలం రూ. 5 నుండి రూ.10 కోట్లకు కొంటున్నామని చెప్పడం గమనార్హం.
అయితే, పోచారం కూడా ఆ రకంగానే డబ్బులకు అమ్ముడుపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. తన పార్టీ మార్పుపై పోచారం మరోసారి స్పందించారు. సీఆర్ వల్లే బాన్సువాడకు 11 వేల ఇళ్లు వచ్చాయని ఆయన అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో బాన్సువాడ నియోజకవర్గనికి రూ.550 కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. డిస్ట్రిబ్యూటరీ ల మరమ్మతులకు రూ.150 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.150 కోట్లు, చందూర్ లిఫ్ట్‌కు రూ.160 కోట్లు, సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు రూ.200 కోట్ల వెచ్చించారని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే, ఈ అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలనే ఆలోచనతోనే పార్టీ మారినట్లు ఆయన వెల్లడించారు.