పాములు, తేళ్లు, పందికొక్కులు డార్మిటరీలకు రాకుండా రిపేర్లు చేయడానికి పాఠశాలలకు డార్మిటరీలకు ఎన్ని నిధులు మంజూరు చేశారని ప్రశ్నించారు. గురుకులాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలోఇద్దరు విద్యార్థులు పాముకాటు కారణంగా మృతిచెందిన ఘటనపై BRS నేత, ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించారు. కేవలం పది రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు చనిపోవడం, మరొకరు వెంటిలేటర్‌పై ఉండడం బాధకారమంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ పెట్టారు. తెలంగాణలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లల సంక్షేమం ఎవ్వరికి పట్టనట్టుగా ఉందని ఆయన విమర్శించారు.
కేవలం హైదరాబాదులో పబ్లిక్, ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్ల పిల్లల ప్రాణాలే ముఖ్యమా? మా పేద పిల్లలవి ప్రాణాలు కావా? అని ఆయన ప్రశ్నించారు. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు కేసీఆర్ ప్రభుత్వం స్థాపించిన పనేషియా 24x7 కమాండ్ సెంటర్‌ను ఎందుకు మూసేశారని ఆయన ప్రశ్నించారు. పాములు, తేళ్లు, పందికొక్కులు డార్మిటరీలకు రాకుండా రిపేర్లు చేయడానికి పాఠశాలలకు డార్మిటరీలకు ఎన్ని నిధులు మంజూరు చేశారని ప్రశ్నించారు. గురుకులాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
పిల్లలు ఫ్లోర్ మీద పండుకుంటే పాములు కాటువేస్తాయని కేసీఆర్ సర్కార్ డబుల్ మంచాలు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేక పోతోందని ఆయన నిలదీశారు. గురుకులాలకు, హాస్టళ్లకు పక్కా భవనాలు ఎప్పుడొస్తాయని, ఇప్పుడు ఎంత డబ్బు కేటాయించారని ఆయన ప్రశ్నించారు.
అణచివేయబడ్డ, వెనకకు నెట్టివేయబడ్డ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయడం లేదని, మీకు పదవులే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా?? ఎస్సీ ఎస్టీ బీసీ మానవ హక్కుల కమీషన్లు ఎందుకు మూగబోయాయని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.