ఓపెన్ కేటగిరిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, స్పోర్ట్స్, EWS, తదితర కోటాలకు చెందిన అభ్యర్థులు, మంచి మెరిట్ సాధించిన అభ్యర్థులు అర్హులు అవుతారా లేదా అని ఆయన ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి BRS నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 29పై తనకు పలు సందేహాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. పబ్లిక్ సర్వీసు కమీషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాల్లో కమ్యూనిటీ వారీగా కట్ అఫ్ మార్కులను ప్రకటించక పోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.
ఓపెన్ కేటగిరిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, స్పోర్ట్స్, EWS, తదితర కోటాలకు చెందిన అభ్యర్థులు, మంచి మెరిట్ సాధించిన అభ్యర్థులు అర్హులు అవుతారా లేదా అని ఆయన ప్రశ్నించారు. వారు అర్హులు అవుతారని సుప్రీం చెప్పినందుకే మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ జీవో 55ను తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు.
అయితే, తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ముందు వెనుక ఆలోచించకుండా జీవో 55ను ఎందుకు రద్దు చేసారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల ప్రిలిమ్స్ రాసిన వారిలో ఓపెన్ కేటగిరిలో మెరిట్ సాధించిన అభ్యర్థుల క్వాలిఫై అయ్యారా అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం లేదా.. TgPSC స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.