కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీకి కొత్త ఛైర్మన్ ని నియమించారు. 1983 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి సుదాన్ కు యూపీఎస్సీ బాధ్యతలు అప్పగించారు.
న్యూస్ లైన్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీకి కొత్త ఛైర్మన్ ని నియమించారు. 1983 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి సుదాన్ కు యూపీఎస్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్న ఆమెకు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్ పర్సన్ బాధ్యతలు ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
మొన్నటి వరకు యూపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న మనోజ్ సోనీ సొంత కారణాలతో పదవికి రాజీనామా చేశారు. 2029 మే 15 వరకు ఆయన పదవీకాలం ఉన్నటప్పటికీ ఐదేళ్ల ముందుగానే బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకున్నారు. తన శేష జీవితాన్నిఅనూపం మిషన్ కి అంకింతం చేసేందుకే పదవికి రాజీనామా చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.