pruthvi raj shetty: గౌతమ్ గెలిస్తే నేను సంతోషిస్తా ..పృథ్వీరాజ్ శెట్టి !

టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన మిగిలిన ఆరుగురిలో నలుగురు ఫైనల్ కి వస్తారు మరో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.


Published Dec 02, 2024 07:34:00 PM
postImages/2024-12-02/1733148559_prithvirajshetty1725555798.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మరో రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 8 అయిపోతుంది. టైటిల్ రేసులో ఉండాల్సిన వాడు సడన్ గా బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం అవినాష్ ను సేవ్ చేసి పాపం పృథ్వీ బలైపోయాడు. అవినాష్ ఆల్రెడీ ఫినాలే బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన మిగిలిన ఆరుగురిలో నలుగురు ఫైనల్ కి వస్తారు మరో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.


సీజన్ 7లో ఆరుగురు ఫైనల్ కి వెళ్లారు. ఈ సారి కూడా ఆరుగురుని కంటెస్టెంట్స్ కి ఛాన్స్ ఇవ్వవచ్చు. ఇక చివరికి వారానికి గాను అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ నామినేషన్స్ లో అవినాష్ లేడు .. ఒక వేళ  ఎలిమినేషన్ గాని ఉంటే విష్ణు కాని రోహిణి కాని డేంజర్ లో ఉంటారు. అయితే  ఈ ఫినాలే లో ఎవరికి చోటు దక్కుతుంది. పృథ్వీ ఈ వారం లో ఎలిమినేషన్ లో బయటకు వచ్చేశాడు.


పృథ్వి మీడియాతో మాట్లాడాడు. వైల్డ్ కార్డు ఎంట్రీతో పాటు ..ఓజీ గ్యాంగ్స్ తో ఏంటి బెనిఫిట్ అని అడుగుతాడు. అయితే  వాళ్ళు గేమ్ చూసి రావడం అడ్వాంటేజ్. అలాగే మొదటి నుండి ఉన్నవాళ్ళుతో పోల్చితే డిసడ్వాంటేజ్. నిఖిల్ ఫస్ట్ నుంచి చాలా కష్టపడ్డాడు. వైల్డ్ కార్డ్స్ 8 మెంబెర్స్ అంటే  చాలా ఎక్కువ. మేము కూడా 8 మంది ఉన్నాం, అని పృథ్వి అన్నాడు. 


గౌతమ్ విన్ అవుతాడా అని అడగ్గా... గౌతమ్ విన్ అయినా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే..  గౌతమ్ కి చాలా కష్టాలుఉన్నాయి.  చిన్న స్టేజ్ నుంచి ఎదిగాడు. నిజంగా కష్టపడి వచ్చి విన్నర్ అయితే నేను కూడా హ్యాపీనే అంటూ చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు కావాలనే ఇండివిడ్యువల్ ప్లేయర్ అని చూపించడానికి నటిస్తున్నాడేమో అనిపిస్తుంది. గౌతమ్ గెలిచినా ఓకే, కానీ నిఖిల్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పకనే చెప్పాడు . 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nikhil bigboss8 gowtham pruthiraj

Related Articles