ప్రజా సమస్యలకే ఖాళీ లేదనే నేతలు పిచ్చి పిచ్చి క్వశ్చన్లకు కూడా కామెంట్లు పెట్టేంత ఖాళీ గా ఉంటున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రాంగ్ ఆన్సర్స్ ...కాదు కాదు ...ఓ ఇమేజ్ చూపించి మీ ఊర్లో వీటిని ఏమంటారు. భారతీయ జెండా వేసి.. మీరు కాని ఇండియన్ అయితే జైహింద్ అని టైప్ చెయ్యండి. ఒక హీరోయిన్ ఫొటో పెట్టి లైకులు షేర్లు కోసం టైమ్ పాస్ పనులు ఎన్నో పోస్ట్ చేస్తుంటారు సోషల్ మీడియా అడిక్టర్స్. అసలు కొన్ని ఇమేజ్ లు.. క్వశ్చన్స్ సాధారణ ప్రజలు మనమే స్కిప్ చేసేస్తున్నాం లేదా స్క్రోల్ చేసేస్తున్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వాధికారులకు, మినిస్టర్లకు, వారి సోషల్ మీడియా అకౌంట్లు చూసేవారికి మాత్రం ప్రజా సమ్సయల కంటే టైమ్ పాస్ పోస్టులకు కామెంట్స్ పెట్టే పని ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రజా సమస్యలకే ఖాళీ లేదనే నేతలు పిచ్చి పిచ్చి క్వశ్చన్లకు కూడా కామెంట్లు పెట్టేంత ఖాళీగా ఉంటున్నారు.ఇందంతా ఎందుకు ఓసారి ఈ కామెంట్లు చూడండి.
పని పాట లేనోళ్లే ఇలాంటి వాటికి కామెంట్లు పెట్టరు. అలాంటిది ఇంత బిజీ షెడ్యూల్స్ , మీటింగ్స్ , తల మునకలుగా ఉండాల్సిన ప్రభుత్వ శాఖల అధికారులు వీటికి కామెంట్లు పెడుతున్నారంటే వాళ్లని ఏమనాలో అంటున్నారు నెటిజన్లు. బెండకాయ ఇమేజ్ ను పోస్ట్ చేసి.. మీ భాష లో వీటిని ఏమంటారు అని పోస్ట్ చేస్తే.. సైబర్ క్రైమ్స్ పీఎస్ హైదరాబాద్ వారు.. బెండకాయ అని కామెంట్ పెట్టారు. సార్లు అంత ఖాళీగా ఉన్నారేమో. కేసులు ఏం లేవేమో.. బెండకాయ, వంకాయ అంటూ కామెంట్లు పెడుతున్నారంటూ మండి పడుతున్నారు నెటిజనులు.
ఇంకా హైలెట్ ఆన్సర్ ఏంటంటే.. గ్లాసుల్లో నీరు పోసి ..ఏ గ్లాస్ ముందు నిండుతుందో చెప్పండి అనే చిన్న పిల్లల ప్రశ్నలకు మన ప్రభుత్వ సలహాదారు బోరెడ్డి అయోధ్య రెడ్డి చాలా వేగంగా సమాధానం ఇచ్చారు. ఆయన ఎంత ఖాళీగా ఉన్నారో మరి. ప్రజా సమస్యలు , నిరుద్యోగులు నిరసనలు, రైతుల బాధలు ఏవీ సార్ లిస్ట్ లో లేవా అంటున్నారు సోషల్ మీడియాలో పలువురు.
IQ టెస్ట్ అంటూ కొన్ని కూడికలు , తీసివేతలు ఇమేజ్ కు ఆఫీస్ ఆఫ్ మినిస్ట్రీ ఫర్ హెల్త్ , తెలంగాణ అకౌంట్ నుంచి రిప్లై వచ్చింది. ఈ కూడికలన్నీ చేస్తే 60 ఆన్సర్ సార్ అని కామెంట్. ప్రజల కోసం ఆలోచించే నాయకులకు.. సోషల్ మీడియాలో ఇలాంటి సిల్లీ పోస్టులకు కామెంట్లు చేస్తున్నారంటే ప్రజలపై వారి దృష్టి ఏంటో అర్ధమవుతుందంటున్నారు నెటిజన్లు.