వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రహేజా గ్రూప్ తరపున రూ.5 కోట్ల విరాళం అందజేశారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో గత ఐదు ఆరు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా, అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద వల్ల రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా మున్నేరు నదీ ఉధృతి కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ వరద ప్రభావం ఎక్కువగా ఖమ్మం నగరంపై పడింది. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత వరద ప్రవాహం మున్నేరు నదిలోకి రావడంతో నగరంలోని త్రీటౌన్ ప్రాంతం పూర్తిగా ముంపుకు గురైంది.
కాగా, ఈ వరద బాధితులకు ఆదుకునేందుకు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు భారీ ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందుతున్నాయి. ఈ క్రమంలో శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా కలిశారు. వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రహేజా గ్రూప్ తరపున రూ.5 కోట్ల విరాళం అందజేశారు. సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజాకి ముఖ్యమంత్రి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.