ఇంకా ఏడు వేల కోట్లు కాంగ్రెస్ ఈసీకి చేసిన ఫిర్యాదుతో చెల్లించకుండా మిగిలిపోయాయని, ఆ డబ్బే మంత్రుల కాంట్రాక్టు సంస్థలకు వెళ్లిందని ఆయన అన్నారు. లక్ష లోపు రుణాల మొత్తం కేసీఆర్ హయాంలో రూ.19 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ. 6 వేల కోట్లకు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఎవర్ని మోసం చేస్తున్నారని అన్నారు. రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని అన్నారు. కేసీఆర్ కట్టిన రైతు వేదికల్లో కాంగ్రెస్ సంబరాలు చేసిందని రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ నేతలకు బూతుల మీద ఉన్న శ్రద్ధ.. రైతుల మీద లేదని BRS నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసింది రూ.6 వేల కోట్లు మాత్రమే అని ఆయన వెల్లడించారు.
రైతులకు అంతా మేమే చేశాం, కేసీఆర్ హయంలో ఏం జరగలేదన్నట్టుగా గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల కోసం గోరంత చేసి కొండంత అని చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో మొదటి విడతలో 35 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లు రుణమాఫీ కింద చెల్లించామని ఆయన గుర్తుచేశారు. రెండో విడతలో రూ.19 వేల కోట్లు రుణమాఫీకి సిద్ధంగా ఉంచుకుని రూ.12 వేల కోట్లు చెల్లించామని అన్నారు.