రాకెష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా లేకా ప్రశ్నించే గొంతులను అణిచివేసే రాజ్యమా అని ప్రశ్నించారు. అడిగితే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని అన్నారు. నిరుద్యోగుల తరుపున నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకున్ని పరామర్శించే స్వేచ్ఛ కూడా మాకు లేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను సెక్యూరిటీతో పంపించారు. నేడు ప్రతిపక్ష నాయకులపై నిర్బంధం ఏంటని ఆయన నిలదీశారు.
న్యూస్ లైన్ డెస్క్: నిరుద్యోగుల తరఫున నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్(Motilal Nayak) అనే విద్యార్థి నాయకుడ్ని పరామర్శించేందుకు వెళ్లిన BRS నేత ఏనుగుల రాకేష్ రెడ్డి(ఏనుగుల రాకేష్ రెడ్డి)ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం గాంధీ హాస్పిటల్(Gandhi hospital) వద్దకు వెళ్లిన ఆయనను గేటు బయటే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. మరోవైపు అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కూడా అదుపులోకి తీస్కున్నారు.
దీంతో రాకెష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా లేకా ప్రశ్నించే గొంతులను అణిచివేసే రాజ్యమా అని ప్రశ్నించారు. అడిగితే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని అన్నారు. నిరుద్యోగుల తరుపున నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకున్ని పరామర్శించే స్వేచ్ఛ కూడా మాకు లేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను సెక్యూరిటీతో పంపించారు. నేడు ప్రతిపక్ష నాయకులపై నిర్బంధం ఏంటని ఆయన నిలదీశారు.
రాకేష్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు, ఎమ్మేల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ని చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరితో పాటు మరో 50 మంది BRS నాయకులు, BRSV నాయకులు, కార్యకర్తలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.