BRS Video: గోషామహల్ స్టేడియంకు వెళ్లిన రాకేష్ రెడ్డి

అయినప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో కొందరు నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్‌లకు వ్యతిరేకంగా కొందరు నిరుద్యోగులు గోషామహల్ స్టేడియంకు వెళ్లారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన స్థలంలోనే నిరుద్యోగులు దీక్ష చేసేందుకు బైఠాయించారు. 
 


Published Jul 05, 2024 07:20:09 AM
postImages/2024-07-05/1720181409_modi33.jpg

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడు నెలలుగా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు TGSPSC ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు, BRSV కార్యకర్తలు, నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు.  

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించి తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని అన్నారు. TGSPSC ముట్టడికి ప్రయత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో కొందరు నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్‌లకు వ్యతిరేకంగా మరికొందరు నిరుద్యోగులు గోషామహల్ స్టేడియంకు వెళ్లారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన స్థలంలోనే నిరుద్యోగులు దీక్ష చేసేందుకు బైఠాయించారు. 

ఈ క్రమంలోనే నిరుద్యోగ యువతను పరామర్శించడానికి BRS నేత రాకేష్ రెడ్డి గోషామహల్ స్టేడియంకు వెళ్లారు. అయితే, రాకేష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీస్ అధికారులపై ఉస్మానియా విద్యార్థి నేతలు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచే వాళ్లను కూడా నిలువరించే హక్కు మీకెక్కడిదని పోలీసులతో ఉస్మానియా విద్యార్థి నేతలు, నిరుద్యోగులు వాగ్వాదానికి దిగారు. దీంతో గోషామహల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu brs rakesh-reddy telanganam strike brsv rakesh-reddy-enugula

Related Articles