Rangam: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.. ఏం చెప్పారంటే..?

ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని, సంతోషంతో భక్తులను రప్పించుకున్నట్లు తెలిపారు. ఏ బోనం తెచ్చినా.. ఎవరు తెచ్చినా స్వీకరిస్తానని అన్నారు. కోరినని వర్షాలు ఉన్నాయని.. అంతకుమించి కోరుకోవద్దని అన్నారు. పాడిపంటలు సమృద్దిగా ఉంటాయని.. ఎటువంటి లోటు ఉండదని అన్నారు. వ్యాధులు కూడా సోకకుండా చూసుకుంటానని అన్నారు. పాడి పశువులను రక్షిస్తానని అన్నారు. 
 
Published Jul 22, 2024 02:16:49 AM
postImages/2024-07-22/1721632455_modi20240722T120258.011.jpg

న్యూస్ లైన్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగం నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండపై నిలబడి వినిపించే భవిష్యవాణిని అమ్మవారు చెప్పే మాటగానే భక్తులు నమ్ముతారు. కొలిచిన వారికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటానని అన్నారు.

ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని, సంతోషంతో భక్తులను రప్పించుకున్నట్లు తెలిపారు. ఏ బోనం తెచ్చినా.. ఎవరు తెచ్చినా స్వీకరిస్తానని అన్నారు. కోరినని వర్షాలు ఉన్నాయని.. అంతకుమించి కోరుకోవద్దని అన్నారు. పాడిపంటలు సమృద్దిగా ఉంటాయని.. ఎటువంటి లోటు ఉండదని అన్నారు. వ్యాధులు కూడా సోకకుండా చూసుకుంటానని అన్నారు. పాడి పశువులను రక్షిస్తానని అన్నారు. 

కష్టం లేకపోతే సోమరిపోతులు అవుతారని.. తన వద్దకు వచ్చేందుకు ఆ మాత్రం కష్టం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఏం జరిగినా కాపాడుతానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది పప్పు బెల్లం, ఫలహారంతో సాక బెట్టాలని కోరారు. 'నా రూపం పెట్టాలనుకుంటున్నారుగా పెట్టుకోండి అని అన్నారు. ఎన్ని జరిగినా రూపాన్ని నేను నిలబెట్టుకుంటాను' అని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : india-people newslinetelugu secundrabad ashadamasam telugu-news

Related Articles