JNTU: హాస్టల్ చెట్నీలో ఎలుక

సుల్తాన్‌పూర్‌లోని JNTU క్యాంపస్ హాస్టల్ విద్యార్థులు తినే చెట్నీలో ఎలుక ప్రత్యేక్షం అయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం టిఫిక్ కోసం తయారు చేసిన చెట్నీలో ఎలుక ఈత ఈత కొడుతూ కనిపించింది. విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-09/1720513547_Screenshot20240709135124.jpg

న్యూస్ లైన్ డెస్క్: సుల్తాన్‌పూర్‌లోని JNTU క్యాంపస్ హాస్టల్ విద్యార్థులు తినే చెట్నీలో ఎలుక ప్రత్యేక్షం అయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం టిఫిక్ కోసం తయారు చేసిన చెట్నీలో ఎలుక ఈత ఈత కొడుతూ కనిపించింది. విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

దీంతో JNTU యాజమాన్యంపై పులువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తినే ఆహారం పట్ల కనీస జాగ్రత్తలు పాటించరా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని, అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. 

తాజగా, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ మాధురి, RDO పాండు JNTU క్యాంపస్‌‌ను పరిశీలించారు. విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. వంటగదిని అడిషనల్‌ కలెక్టర్‌ పరిశీలించారు. కిచెన్‌ పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగదిలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రిన్సిపల్‌, మెస్‌ కాంట్రాక్టర్‌పై మండిపడ్డారు. మెస్‌ కాంట్రాక్టర్‌ను మార్చాలని ప్రిన్సిపల్‌కి ఆదేశాలు జారీ చేశారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telanganam juntu ratinfood

Related Articles