డాగ్ చనిపోయిన వార్త విన్న వారు .. ‘అయ్యో’ అని నిట్టూరుస్తున్నారు. యజమాని మృతిని అది జీర్ణించుకోలేకపోయిందని, టాటాతో దానికి అంత బాండింగ్ ఉందంటూ సంతాపం కూడా ప్రకటిస్తున్నారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గోవా చనిపోవడం ఏంటి రా నాయనా ...అనుకుంటున్నారా..గోవా అంటే రతన్ టాటా పెట్ డాగ్ . రతన్ టాటా చనిపోయిన వెంటనే డాగ్ కూడా చనిపోయిందనే వార్త అన్ని రాష్ట్రాల్లోను వైరల్ అవుతుంది. అయితే దీని పై రతన్ టాటా టీం తో పాటు ముంబై పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు.
అయితే డాగ్ చనిపోయిన వార్త విన్న వారు .. ‘అయ్యో’ అని నిట్టూరుస్తున్నారు. యజమాని మృతిని అది జీర్ణించుకోలేకపోయిందని, టాటాతో దానికి అంత బాండింగ్ ఉందంటూ సంతాపం కూడా ప్రకటిస్తున్నారు. మనుషుల కంటే శునకాలు విశ్వాసపాత్రమైనవని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదని తెలిపారు. ‘గోవా’ నిక్షేపంలా ఉందని పేర్కొన్నారు. రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుని అడిగి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్టు తెలిపారు. గోవా బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.
అయితే రతన్ టాటా గురించిన పరిచయం భారతీయులకు అవసరం లేదు. అక్టోబర్ 10 వతారీఖున రతన్ టాటా తన తుది శ్వాస విడిచారు. పార్సీ పధ్ధతి లో కాకుండా హిందువుల సాంప్రాదాయం ప్రకారం...తనను కననం చేశారు.