అయితే ప్రముఖ నటి , భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు రేణు దేశాయ్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్ లో అటవీ, పర్యావరణ , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని వారింట్లో చాలా ఫార్మల్ గా కలిశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రేణుదేశాయ్ , పవన్ కళ్యాణ్ ...ఎప్పుడు హిట్టు జంట. పర్సనల్ విషయాలు ఎన్నైనా ఉండని...ఫ్యాన్స్ కు మాత్రం రేణుదేశాయ్ ఎప్పుడు ఫేవరేట్. చక్కగా చూడముచ్చటగా ఉండేది జంట. మనం ఒకటనుకుంటాం...ఫేట్..మరొకటి రాస్తుంది కదా...పర్సనల్ ఇష్యూస్ తో విడిపోయారు కాని కలిసి ఉంటే బాగుండేదనేది ఫ్యాన్స్ కోరిక. అయితే రేణుదేశాయ్ చాలా సార్లు చెప్తూనే వచ్చింది మాకు సెట్ కాలేదు..ఇక కలవలేం..ఇబ్బందిపెట్టకండి అని చెబుతూనే ఉంది.
అయితే ప్రముఖ నటి , భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు రేణు దేశాయ్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్ లో అటవీ, పర్యావరణ , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని వారింట్లో చాలా ఫార్మల్ గా కలిశారు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి సురేఖ గారికి వివరించారు.
రేణుదేశాయ్ ని మంత్రి సురేఖ బట్టలు, బంగారు గొలుసు పెట్టి సత్కరించారు. వచ్చే వారం ఆంధ్రప్రదేశ్ ఆనం రామనారాయణ రెడ్డి ని కలిసే అవకాశమున్నట్లు తెలిపారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ గురించి ఆంధ్రాలోని పెద్దవాళ్లతో మాట్లాడే అవకాశాలున్నట్లు తెలిపారు. ఆనం తో పాటు ...డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా కలిసి మాట్లాడే అవకాశాలున్నాయి. ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మికను కూడా పిల్లలు అలవరచుకోవాలనేది రేణుదేశాయ్ , భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అభిప్రాయం. ఇలా అఫిషియల్ గా పవన్ ను రేణుదేశాయ్ కలుస్తున్నారంటే ఫ్యాన్స్ కి ఇక పండగే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.