రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు.7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లిస్తున్నారని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. రైతులకు హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. మొత్తం 40 లక్షల పైగా రైతులు రూ.లక్ష వరకు లోన్ తీసుకున్నారని వెల్లడించారు. అలాంటపుడు రుణమాఫీకి కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: రుణమాఫీ పేరిట తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తోందని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వానాకాలం పంటకు రైతుబంధు కింద రావాల్సిన నిధులను రేవంత్ రెడ్డి రుణమాఫీకి మళ్లిస్తున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. దీంతో రైతులను నిజంగానే రేవంత్ సర్కార్ మోసం చేస్తోందనే వాదనకు మరింత బలం వచ్చి చేరింది.
రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు.7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లిస్తున్నారని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. రైతులకు హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. మొత్తం 40 లక్షల పైగా రైతులు రూ.లక్ష వరకు లోన్ తీసుకున్నారని వెల్లడించారు. అలాంటపుడు రుణమాఫీకి కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు. గతంలో BRS అధినేత కేసీఆర్ అధికారంలో ఉండగా 2014, 2018లో చేసిన రుణమాఫీతో పోలిస్తే.. కాంగ్రెస్ చేతున్నదానిలో పావు వంతు రైతులు మాత్రమే అర్హులా అని కేటీఆర్ ప్రశ్నించారు.
2014లోనే కేసీఆర్ ప్రభుత్వం లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు ఖర్చుచేసిందని, ఇందులో భాగంగా సుమారు 35 లక్షల రైతులు లబ్ధిపొందారని గుర్తుచేశారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా వేయగా.. సుమారు 37 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలని సూచించారు.