Revanth reddy : పార్టీలో చేరిన ఎమ్మెల్యేల ఆస్తి వివరాలు సేకరిస్తున్న సీఎం రేవంత్

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇప్పటికే కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఫలితం గనుక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తే ఉప ఎన్నికలు ఖాయం.


Published Aug 07, 2024 06:48:19 PM
postImages/2024-08-07/1723036699_BRSMLAsWhojoinedInCongress.jpg

న్యూస్ లైన్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ వదిలి రేవంత్ ని నమ్మి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. పార్టీలోకి వస్తే మంత్రి పదవులు.. ఇతర లాభాలు ఉంటాయని నమ్మి వచ్చిన నేతలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యే చూపించింది. మరోవైపు వాళ్లు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో అని కాంగ్రెస్ పార్టీకి కూడా టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ కి పదవీ గండం, అసమ్మతి వంటి ప్రమాదం పొంచి ఉందనే సమాచారంతో అలర్ట్ గా ఉంటున్నారు. పైగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇప్పటికే కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఫలితం గనుక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తే ఉప ఎన్నికలు ఖాయం. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా మారే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే.. కారు పార్టీ నుంచి వచ్చి చెయ్యి పార్టీలో చేరిన ఎమ్మెల్యే జారిపోకుండా కాపాడుకునేదుంకు రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేశారు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేల ఆస్తులు, ఆదాయ వివరాలు, భూముల వివరాలు సేకరిస్తున్నారు.  బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఆశపెట్టి పార్టీలో కొనసాగేలా చేసే పరిస్థితులయితే ప్రస్తుతం కనిపించడం లేదు. మరోవైపు పార్టీలో చేరినందుకు కాస్తో కూస్తో లీడర్లు కలిసిపోయినట్టు కనిపిస్తున్నా క్యాడర్ మాత్రం గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను అస్సలు సహించడం లేదు. నిన్న గాక మొన్న వచ్చి పార్టీలో పెత్తనం చెలాయిస్తారా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై తమ అసమ్మతిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్కలా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీలో కొనసాగలేక.. తిరిగి గులాబీ గూటికి చేరలేక.. పార్టీ వీడి రేవంత్ దాడికి గురి కాలేక ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy mla cm-revanth-reddy congress-leader-harassments joinscongress

Related Articles