అర్బన్ ప్రిస్మ్ పేరుతో ఈ ఏడాది మే 30న దీన్ని రిజిస్టర్ చేశారు. తిరుపతి రెడ్డితో పాటు చాడా వెంకటేశ్వర్లు అనే ఆయన దీనిలో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఇద్దరే ఇందులో కీలక భాగస్వాములు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఆ కంపెనీలకు వ్యవస్థాపకులు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. ఈ పరిణామాలు సరికొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. స్వలాభం కోసమేనన్న చర్చకు దారితీస్తున్నాయి. అసలే రేవంత్ సర్కార్ కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ వస్తుంది. ఆ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టుల కోసమే ఈ కంపెనీలన్న చర్చ కూడా జరుగుతోంది. తమ బొక్కసాలను నింపుకోవడానికి ఈ సూట్ కేస్ కంపెనీలను సృష్టిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి సోదరరుడు తిరుపతి రెడ్డి పేరు మీద రీసెంట్‌గా ఓ కంపెనీ ప్రారంభమైంది. అర్బన్ ప్రిస్మ్ పేరుతో ఈ ఏడాది మే 30న దీన్ని రిజిస్టర్ చేశారు. తిరుపతి రెడ్డితో పాటు చాడా వెంకటేశ్వర్లు అనే ఆయన దీనిలో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఇద్దరే ఇందులో కీలక భాగస్వాములు. మొత్తం కోటి రూపాయల మూలధనంతో ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. జూబ్లిహిల్స్‌లోని కావూరి హిల్స్‌లో ఉన్న ఐకాన్స్ క్యాపిటల్స్‌లోని బ్లాక్ బీలో ఉన్న ప్లాట్ నెం.56ను చిరునామాగా పేర్కొన్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారన్న విషయం తెలిసిందే. తాజాగా రిజిస్టర్ అయిన కంపెనీ వెనక ఏ మతలబు ఉందోనన్న చర్చ నెట్టింట జరుగుతోంది.
రాచకొండలో కొత్త నగరం, మూసీ సుందరీకరణ తదితర ప్రాజెక్టులు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్స్. ఈ నేపథ్యంలో ఈ కొత్త కంపెనీల ఏర్పాటు వెనక వాటి కాంట్రాక్టులు ఏమైనా దాగున్నాయా అనుకుంటున్నారు. ఊరక రారు మహానుభావులు అన్నట్టు.. ఉత్తగనే కొత్త కంపెనీలు ఏర్పాటు చేయరు కదా అన్నది ఈ గుసగుసల వెనక సారాంశం. లోగుట్టు పెరుమళ్లకెరుక అన్నట్టుగా దీని వ్యవహారం ఉంది. ఒకపక్క సైలెంట్‌గా పెద్దలు తమ పని తాము చేసుకు పోతుంటే.. ఇంకోపక్క దానిపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆయా పెద్దలే నేరుగా స్పందిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి.