కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. తాతలు, తండ్రుల ద్వారా వచ్చి వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: రేవంత్ రెడ్డి మేనేజ్‌మెంట్ కోటాలో సీఎం అయ్యారని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య హోరాహోరీగా వార్ జరిగింది. తాము స్వయం కృషితో రాజకీయాల్లోకి వచ్చామని, కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. తాతలు, తండ్రుల ద్వారా వచ్చి వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా పేమెంట్ కోటలోనే సీఎం అయ్యారని మేము కూడా అనొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తాతలు, తండ్రులు అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీల గురించే ఆయన ఆ మాటలు అన్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిండు అని మేము కూడా అనొచ్చు.
అయ్యల పేర్లు చెప్పి పదవులు అని రేవంత్ మాట్లాడుతుండు.. అది రాహుల్ గాంధీ గురించా లేక రాజీవ్ గాంధీ గురించా తెల్వదు.
- అసెంబ్లీలో ఎమ్మెల్యే కేటీఆర్ pic.twitter.com/XpJZ5Lrplf — News Line Telugu (@NewsLineTelugu) July 24, 2024