సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులు కూడా జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన గవర్నర్ కు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి. రేవంత్ రెడ్డి, శాంతి కుమారి, జితేందర్ నూతన గవర్నర్‌కు పుష్పగుచ్చం అందించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం తన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు స్వాగతం పలికారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులు కూడా జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన గవర్నర్ కు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి. రేవంత్ రెడ్డి, శాంతి కుమారి, జితేందర్ నూతన గవర్నర్‌కు పుష్పగుచ్చం అందించారు.
రాష్ట్రానికి గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులు కావడం సంతోషకరమైన విషయమని రేవంత్ అన్నారు. కాగా, త్రిపుర డిప్యూటీ సీఎంగా ఉన్న జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5.03 గంటలకు నిర్వహించేందుకు రాష్ట్ర యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.