భద్రాద్రి కొత్తగూడెం-అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. గండి పడ్డ అంశంపై ఆయన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు 35-40 వేల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యం ఉండగా, ఇప్పుడు వర్షాలకు 80 వేల క్యూసెక్కులు పోటెత్తే వరకు గేట్లు ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించారు. గతంలో ప్రాజెక్టు మరమ్మతులకు రూ.2 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అయినా కట్టకు ఎందుకు గండి పడిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం-అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడడంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించారు. తమ నిర్లక్యం కారణంగానే పెద్ద వాగు కొట్టుకుపోయిందని ఆయన అంగీకరించారు.
భద్రాద్రి కొత్తగూడెం-అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. గండి పడ్డ అంశంపై ఆయన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు 35-40 వేల క్యూసెక్కుల వరదను తట్టుకునే సామర్థ్యం ఉండగా, ఇప్పుడు వర్షాలకు 80 వేల క్యూసెక్కులు పోటెత్తే వరకు గేట్లు ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించారు. గతంలో ప్రాజెక్టు మరమ్మతులకు రూ.2 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అయినా కట్టకు ఎందుకు గండి పడిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల తీవ్ర నిర్లక్ష్యమే ప్రాజెక్టు గండికి కారణమని స్థానిక రైతులు తుమ్మలకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ప్రాజెక్టు రీడిజైన్ చేసి ఇప్పుడున్న 3 గేట్లకు గాను మరో 3 గేట్లు అదనంగా ఏర్పాటు చేసి రాబోయే వానాకాలం లోపు ప్రాజెక్టు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.