తెలుగు అకాడమీ ప్రామాణిక పుస్తకాలను మళ్లీ మళ్లీ చదవాలని తెలిపారు. ట్రెండ్ అర్ధం చేసుకుంటూ స్మార్ట్‌గా చదవాలని ఆయన సూచించారు. గైడ్లు, కోచింగ్ మెటీరియల్ వంటి వాటిపై 'పూర్తిగా' ఆధారపడకుండా.. టెస్టు సీరిస్‌లు చదవాలని తెలిపారు. చదువుతున్న సమయంలో ఇంపార్టెంట్ అనిపించిన వాటిని బుక్కులో రాసుకోవాలి వెల్లడించారు. ఇతరుల పుస్తకాలపై ఆధారపడకూడదని ఆయన నొక్కిచెప్పారు. యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రాం కోచింగులు లేదా ఆన్లైన్ టిప్స్ ఒక గంట కన్నా ఎక్కువ సమయం చూడొద్దని ప్రవీణ్ కుమార్ సూచించారు.
న్యూస్ లైన్ డెస్క్: గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు BRS నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ పలు కీలక సూచనలు చేశారు. గ్రూప్స్ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని దౌర్జన్యాలకు దిగినా, బౌన్సర్లను దింపినా, సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా ట్రోలింగ్ చేసినా వెనుకడుగు వేయకుండా డిమాండ్లను సాధించిన తెలంగాణ నిరుద్యోగులు, వారి నాయకులకందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
అలాగే పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు ప్రవీణ్ కుమార్ పలు కీలక సూచనలు చేశారు. పోస్టులను పెంచాలని శాంతియుతంగా పోరాడుతూనే.. మరోవైపు రానున్న పోటీ పరీక్షలకు బాగా ప్రిపేర్ అవ్వాలని ఆయన సూచించారు. సిలబస్ కాపీలను గోడలకు అతికించుకోవాలని ఆయన సూచించారు. కనీసం పది ప్రశ్నల పాత్రలను అయినా సాల్వ్ చేస్తే.. ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు అనే దానిపై పట్టు వస్తుందని తెలిపారు.
తెలుగు అకాడమీ ప్రామాణిక పుస్తకాలను మళ్లీ మళ్లీ చదవాలని తెలిపారు. ట్రెండ్ అర్ధం చేసుకుంటూ స్మార్ట్‌గా చదవాలని ఆయన సూచించారు. గైడ్లు, కోచింగ్ మెటీరియల్ వంటి వాటిపై 'పూర్తిగా' ఆధారపడకుండా.. టెస్టు సీరిస్‌లు చదవాలని తెలిపారు. చదువుతున్న సమయంలో ఇంపార్టెంట్ అనిపించిన వాటిని బుక్కులో రాసుకోవాలి వెల్లడించారు. ఇతరుల పుస్తకాలపై ఆధారపడకూడదని ఆయన నొక్కిచెప్పారు. యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రాం కోచింగులు లేదా ఆన్లైన్ టిప్స్ ఒక గంట కన్నా ఎక్కువ సమయం చూడొద్దని ప్రవీణ్ కుమార్ సూచించారు.
సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో మాత్రమే సమయం గడపాలని సూచించారు. సాయంత్రం 5-7 గంటల సమయంలో గ్రూప్ డిస్కషన్ చేయాలని తెలిపారు. మద్యపానానికి, దావత్‌లకు, సిగరెట్లకు, యూట్యూబ్ ఫన్ వీడియోలకు కొంతకాలం దూరంగా ఉండాలని సూచించారు. సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులను కలిసి మాట్లాడితే కొంత స్పూర్తి వస్తుంది. ఫెయిల్ అయిన వాళ్ల గురించి అలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దని ప్రవీణ్ కుమార్ తెలిపారు.