గతంలో ఎప్పుడు లేని విధంగా లబ్ధిదారులు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారని చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక BRS నాయకులతో కలసి కార్యక్రమం వద్దనే బైటాయించి నిరసనకు దిగారు. ఒకపక్క BRS ఆందోళన లు కొనసాగిస్తుండగా.. మరో పక్కా దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పలు ఆలయ కమిటీలకు బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్లకు సంబందించిన చెక్కులను పంపిణీ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ మహేశ్వరం నియోజకవర్గం RKపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయం వద్ద BRS ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగారు. బోనాలకు సంబంధించి దేవాలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రచ్చ తారాస్థాయికి చేరింది. ప్రోటోకాల్ లేని వ్యక్తులను వేదిక పైకి ఆహ్వానించవద్దనే కారణంతో, అధికారులు సబితా ఇంద్రారెడ్డి వారించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను వేదికపైకి పంపించారు అధికారులు. దీంతో అధికారుల తీరుకు నిరసనగా వేదిక కింద కూర్చుని ఆమె నిరసన తెలిపారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా లబ్ధిదారులకు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారని చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక BRS నాయకులతో కలసి కార్యక్రమం జరుగుతున్న వేదిక వద్దనే బైఠాయించి నిరసనకు దిగారు. ఒకపక్క BRS ఆందోళనలు కొనసాగిస్తుండగా.. మరో పక్కా దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పలు ఆలయ కమిటీలకు బోనాల పండుగ ఉత్సవాల ఏర్పాట్లకు సంబందించిన చెక్కులను పంపిణీ చేశారు.
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సబితా ఇంద్రారెడ్డి అధికారులపై మండిపడ్డారు. వేదిక కిందనే కూర్చొని నిరసన తెలిపారు. ఓడిన ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం గెలిచిన వారికి ఇవ్వరా అని ఆమె ప్రశ్నించారు. అయినప్పటికీ అధికారులు స్పందించక పోవడంతో ఇరు వర్గాలకు మధ్య కాస్త వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నికల్లో గెలిచిన సబితా ఇంద్ర రెడ్డి స్టేజి కింద ఉండగా.. ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు స్టేజీ పైన ఉండాల్సి వచ్చింది.