ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ గేట్లు ఎత్తి నీటిని దిగువకి విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనా వేసి గేట్ల సంఖ్య పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకున్నాయి. నేడు నాగార్జునసాగర్ రేడియల్ క్రస్టు గేట్లను అధికారులు అధికారులు ఓపెన్ చేయనున్నట్లు ఈఎన్సీ అనిల్ కుమార్ తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. మొదట 50 వేల క్యూసెక్కులు విడుదల చేసి.. తర్వాత ఇన్‌ఫ్లో ఆధారంగా క్రమంగా పెంచుతామని ఆయన అన్నారు.
ఈ మేరకే ఒక్కో గేటు నుంచి 5 వేల క్యూసెక్కుల చొప్పున 30 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. కృష్ణమ్మకి జల హారతి ఇచ్చి అధికారాలు గేట్లను ఎత్తారు. ఎస్ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్ కుమార్ గేట్లు ఎత్తి నీటిని దిగువకి విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వచ్చే వరద అంచనా వేసి గేట్ల సంఖ్య పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 6 గేట్లను 5 ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం వరకు 6 లేదా 8 గేట్లు ఎత్తి.. స్పీల్ వే ద్వారా 2 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.
నాగార్జునసాగర్ 5 ఫీట్ల మేర 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల.
ఒక్కో గేటు నుంచి 5 వేల క్యూసెక్కుల చొప్పున 30 వేల క్యూసెక్కుల నీటి విడుదల. pic.twitter.com/2LJ18zmJLA — News Line Telugu (@NewsLineTelugu) August 5, 2024