ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా హీరోయిన్లపై లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఒక అడుగు ముందుకేసి హీరోయిన్
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా హీరోయిన్లపై లైంగిక వేధింపులకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఒక అడుగు ముందుకేసి హీరోయిన్ సమంత ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సర్కార్ కి ఒక రిక్వెస్ట్ ను పెట్టింది. ఆమె పెట్టిన రిక్వెస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె రిక్వెస్ట్ లో ఇలా రాసుకొచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో నటీనటులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చిన హేమా కమిటీ బాగా కృషి చేస్తుందని సమంత ప్రశంసించింది.
ఇండస్ట్రీలో మహిళల సంరక్షణ కొరకు ఆ సంస్థ చాలా బాగా పనిచేస్తుందని అన్నారు. 2019లో స్థాపించబడిన టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ అయినటువంటి వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా wcc కమిటీ ఆధ్వర్యంలో రావాలని ఆమె కోరుకున్నారు. ఈ విధంగా తెలియ ఇండస్ట్రీలో కూడా జస్టిస్ హేమా తరహాలోనే ఒక కమిటీ తీసుకురావాలని సమంత తెలియజేశారు. దీనివల్ల తెలుగు ఇండస్ట్రీలో మహిళలకు సురక్షితమైన వాతావరణం ఉంటుందని, అలాంటి కమిటీ తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయాలని సమంత ప్రభుత్వం పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఈ విధంగా సమంత ఈ పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
దీనిపై దర్శక, నిర్మాతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో సమంత స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్య పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె మరింత ఇమేజ్ సొంతం చేసుకుంటూ వస్తోంది. ఈ విధంగా యాక్టింగ్ లో మరియు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న సమంత మహిళల వేధింపులపై మాట్లాడడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది.