Saudi: 610 కేజీల నుంచి 63 కేజీల బరువు ఎలా తగ్గాడో తెలుసా?

2013లో ఓ వ్యక్తి బరువు 610 కేజీలు ఉండేది. అయితే ఇప్పుడు 63 కేజీలకు తగ్గాడు. 


Published Aug 15, 2024 03:06:18 PM
postImages/2024-08-15/1723714578_saudi.PNG

న్యూస్ లైన్ డెస్క్: 2013లో ఓ వ్యక్తి బరువు 610 కేజీలు ఉండేది. అయితే ఇప్పుడు 63 కేజీలకు తగ్గాడు. ఖలీద్ బిన్ మోసెన్ సౌదీకి చెందిన వ్యక్తి పదేళ్ల క్రితం 610కిలోల బరువు ఉండేవారు. ప్రపంచంలోనే అత్యంత లావైన, బరువైన వ్యక్తిగా రికార్డు కూడా ఉంది. కాగా, అతను ఎది చేసిన ఒకరిద్దరు సహాయం కావాల్సి వచ్చేది. మూడేండ్లు అధిక బరువుతో బెడ్ కే పరిమితం అయ్యాడు. మోసెన్ పరిస్థితిని చూసి సౌదీ కింగ్ అబ్దుల్లా చలించిపోయారు. అతడి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్న రాజు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. వైద్యం కోసం రియాద్లోని మెడికల్ సిటీలో అన్ని ఏర్పాట్లు చేయించారు. 30 మంది వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు ఖలీద్‌ను పర్యవేక్షించింది. 

మోసెన్ కోసం ప్రత్యేకంగా ఒక బెడ్ తయారు చేయించి, ఫోర్క్‌లిఫ్ట్ సాయంతో వాహనంలో ఖలీద్‌ను ఎక్కించి రియాద్‌లోని కింగ్‌ ఫహద్‌ మెడికల్‌ సిటీకి తరలించారు. అక్కడ వైద్యుల బృందం, మధ్యప్రాచ్యంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు మోసెన్ బరువు తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్యాస్ట్రిక్ బైపాస్, స్కిన్ సర్జరీలు చేశారు. రోజూ ఫిజియోథెరఫీ చేయించేవారు. ప్రత్యేకమైన డైట్ రూపొందించి అందించే వారు. దీంతో ఎట్టకేలకు మోసెన్ 542 కిలోల బరువు తగ్గిపోయాడు. ఇప్పుడు 63 కిలోల బరువుతో మోసెన్ హ్యాపీగా ఉన్నాడు.

newsline-whatsapp-channel
Tags : india-people man uae

Related Articles