ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 1101 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. ఖమ్మం 287, మేడ్చల్ 268, సూర్యాపేటలో 217 డెంగ్యూ కేసులు వచ్చాయని డాక్టర్లు తెలిపారు. జులై 14 నాటికి తెలంగాణలో 6,500 టైఫాయిడ్, 140 మలేరియా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలో సీజనల్ వ్యాధులు భారీగా నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో అధికంగా డెంగ్యూ కేసులే ఉన్నట్లు తెలిపారు. వరి నుంచి ఈ నెల 4 వరకు 2,847 డెంగ్యూల కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 1101 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. ఖమ్మం 287, మేడ్చల్ 268, సూర్యాపేటలో 217 డెంగ్యూ కేసులు వచ్చాయని డాక్టర్లు తెలిపారు. జులై 14 నాటికి తెలంగాణలో 6,500 టైఫాయిడ్, 140 మలేరియా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్‌లో కూడా సీజనల్ వ్యాధుల టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ హాస్పిటళ్లలో విపరీతంగా OPలు రాయించుకుంటున్నారు. మరోవైపు OPలు ఎక్కువగా రావడంతో హాస్పిటళ్లలో సిబ్బంది కొరత కూడా ఏర్పడుతోందని డాక్టర్లు తెలిపారు. ఇటీవల జరిగిన బదిలీల కారణంగానే సిబ్బంది కొరత ఏర్పడిందని వెల్లడించారు. బదిలీలు జరిగిన తరువాత ఖాళీ అయిన పోస్టుల్లో ఇంకా కొత్త వారిని నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.